యష్ బర్త్ డే…కేజీఎఫ్ టీం సర్‌ప్రైజ్

39
kgf

కన్నడ రాక్‌ స్టార్ యష్ పుట్టినరోజు సందర్భంగా కేజీఎఫ్ టీం ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందించింది.ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 14న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెప్పిన మేకర్స్‌…బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు.

అందులో యష్ సీరియస్ గా కన్పిస్తుండగా, ఆయన ముందు “కాజన్, డేంజర్ ఎహెడ్” అనే బోర్డు కన్పిస్తోంది. మా రాఖీభాయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మేకర్స్ ఈ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు.

దక్షిణాదిలో క్రేజ్ ఉన్న సినిమాలలో ‘కేజీఎఫ్’ సీక్వెల్ కూడా ఒకటి. కన్నడ సూపర్ హిట్ ‘కేజీఎఫ్’ కన్నడంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ సంచలన విజయం సాధించటంతో సీక్వెల్ ను రూపొందిస్తున్నారు. సంజయ్ దత్, రవీనాటాండన్, రావు రమేష్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. విజయ్ కిరాగండూర్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండగా… రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.