త్వరలో వైద్యారోగ్య శాఖలో 13 వేల నియామకాలు..

72
harish
- Advertisement -

వైద్యారోగ్య శాఖకు 13 వేల నియామకాలు చేపతబోతున్నామని,త్వరలో నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో టీ డ‌యాగ్నోస్టిక్ మినీ హ‌బ్‌ను, మొబైల్ యాప్‌ను మంత్రి స‌బితా ఇంద్రారెడ్డితో క‌లిసి మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 30 శాతం మాత్రమే కాన్పులు ఉంటాయి.. కానీ ఇప్పుడు 56 శాతం పెరిగాయి.ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఆశ వర్కర్ వేతనలను సీఎం కేసీఆర్ పెంచారు. దేశంలోనే అత్యధికంగా వేతనాలు తీసుకుంటున్నా ఆశ వర్కర్లు తెలంగాణలో మాత్రమే ఉన్నారని అన్నారు.

ప్రజాప్రతినిధులం కేవలం రోడ్ ,డ్రైనేజీలు వేయించడాం మాత్రమే కాదు,ప్రజలు ఆరోగ్య సమస్యలు కూడా చూడాలి. ఎమ్మెల్యే లు,కార్పొరేటర్లు కూడా ప్రభుత్వ ఆసుపత్రులును సందర్శించాలి. ప్రభుత్వంలోనే ఎక్కువ ట్రీట్మెంట్ తీసుకొనే విధంగా ఉండాలి. పేదల పక్షాన పని చేసే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం.సీఎం ఆలోచన మేరకు ఆరోగ్య తెలంగాణ కల సాకారం చేద్దాం అన్నారు మంత్రి హరీశ్‌. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ప‌లువురు నాయ‌కులు, వైద్య అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -