దేశంలో 130 రెడ్ జోన్ జిల్లాలు..

270
preethi sudan
- Advertisement -

దేశంలో రెడ్ జోన్ లో 130 జిల్లాలు, ఆరెంజ్ జోన్ లో 284, గ్రీన్ జోన్ లో 319 ఉన్నట్లు వెల్లడించింది కేంద్రం. ఈ మేరకు దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్.

గతంలో నమోదైన కేసులు, వైరస్ వ్యాప్తి తీవ్రత ఆధారంగా రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్న జిల్లాల్లో మార్పులు నిర్ణయించినట్లు తెలిపారు. పలు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు మార్పులు చేసినట్లు తెలిపారు.

అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 19 జిల్లాలు, మహారాష్ట్ర లోని 14, తమిళనాడు లో 12, ఢిల్లీలో 11, పశ్చిమ బెంగాల్ 10 జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నట్లు వెల్లడించిన ప్రీతి..తెలంగాణ రాష్ట్రంలో రెడ్ జోన్ లో 6 జిల్లాలు.. ఆరెంజ్ జోన్ లో 18, గ్రీన్ జోన్ లో 9 జిల్లాలు ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రంలో రెడ్ జోన్ జిల్లాలు హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, వరంగల్ అర్బన్ ఉండగా ఆరెంజ్ జోన్ జిల్లాలు నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, కొమరం భీం అసిఫాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, జనగాం, నారాయణపేట,
మంచిర్యాల ఉన్నాయి.

గ్రీన్ జోన్‌లో పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి ఉన్నాయి.

- Advertisement -