మేక్ ఇన్ ఇండియాకు 12 ఏళ్లు

8
- Advertisement -

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. దేశీయ తయారీ రంగం, పెట్టుబడులు మరియు ఎగుమతులలో భారత్ సాధించిన పురోగతిని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రధాని మోదీ స్పందిస్తూ “భారత్‌లో మరింత ఉత్పత్తి .. భారత్‌కు మరింత పెట్టుబడి ..భారత్ నుంచి మరింత ఎగుమతి .. అన్ని రంగాల్లోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది! అని పేర్కొన్నారు.

భారత ఆర్థిక వ్యవస్థను, తయారీ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో 2014 సెప్టెంబర్ 25న మోదీ ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
గత 12 ఏళ్లలో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, రక్షణ పరికరాలు, ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లు మరియు డిజిటల్ మౌలిక వసతుల కల్పనలో భారత్ ప్రపంచంలోనే కీలక శక్తిగా రూపాంతరం చెందిందని ప్రధాన మంత్రి గుర్తుచేశారు.

స్వదేశీ ఉత్పాదక సామర్థ్యాలు పెరగడం వల్ల భారత్ ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వావలంబన) దిశగా వేగంగా అడుగులు వేస్తోందని, దీనివల్ల దేశ యువతకు లక్షలాది ఉద్యోగావకాశాలు లభించాయని ఆయన తెలిపారు.

దేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములైన తయారీదారులు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు మరియు శ్రామికుల కృషిని ఈ సందర్భంగా ప్రధాని అభినందించారు.

Also Read:గణేశుడి లడ్డూ@రూ. కోటి

 

- Advertisement -