119 గురుకులాలు ప్రారంభం…

364
bc gurukulalu
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. . ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో పాఠశాల చొప్పున 119 నియోజకవర్గాల్లో గురుకులాలను ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రారంభించారు. బాలికలకు 63, బాలురకు 56 పాఠశాలలు కేటాయించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 280కి బీసీ గురుకులాలు పెరిగాయి.

జనగామ జిల్లాలోని శామీర్‌పేటలో బీసీ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రారంభించారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో మంత్రి ఎర్రబెల్లి,ఎల్బీనగర్ మన్సూరాబాద్‌లో బీసీ గురుకుల పాఠశాలను మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల, శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడిన హోంమంత్రి మహమూద్ అలీ గురుకులాల్లో కార్పొరేట్ స్థాయిలో సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. గురుకులాల్లో మెరుగైన విద్యను అందిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

119 బీసీ గురుకులాల్లో 28,560 విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. పాఠశాలల్లో సకల హంగులు ఉంటాయి. ఐఐటీ, నీట్ కోసం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కంప్యూటర్ విద్యతో పాటు అధునాతనమైన ప్రయోగశాలలు కూడా ఉంటాయి.

- Advertisement -