రాష్ట్రప‌తి ఎన్నిక‌లు..11 నామినేష‌న్లు దాఖ‌లు

74
president election
- Advertisement -

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ బుధ‌వారం విడుద‌ల కాగా తొలిరోజు 11 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. ఈ నెల 29 వ‌ర‌కు నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగ‌నుండ‌గా స‌రైన ప‌త్రాలు లేనికార‌ణంగా ఒక అభ్య‌ర్థి నామినేష‌న్‌ను తిర‌స్క‌రించారు.

మొదటి రోజు నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఢిల్లీ, బిహార్, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. ఇక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే నామినేషన్ దాఖలు చేసిన వారిలో బిహార్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ అనే వ్యక్తి ఉండటం . ఇదే పేరుతో మాజీ సీఎం లాలూ పేరు ఉండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇక రాష్ట్రప‌తి ఎన్నికకు నామినేషన్ వేయాలంటే 50 మంది ఓటు హక్కు కలిగిన అభ్యర్థులు ప్రతిపాదించాలి. మరో 50 మంది ఓటర్లు కూడా ప్రతిపాదిస్తూ సెకండరీ సంతకాలు చేయాలి. ఈ ఎన్నిక కోసం రూ.15,000 డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -