మాతృదేవోభవ…ఈ సినిమా గురించి తెలియని వారుండరూ. ఫ్యామిలి, ఎమోషన్, సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండస్ట్రీ ఆల్ టైం హిట్ సినిమాల్లో ఒకటి. ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టని వారు లేరంటే అతిశయోక్తి కాదు.
తాజాగా ఇప్పుడు ఇదే టైటిల్‌తో మరో సినిమా రాబోతుంది. దీనికి ఓ అమ్మ కథ అనే ట్యాగ్ లైన్ ఉండగా జులై 1న రిలీజ్ కానుంది. సీనియర్ నటి సుధ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. ఆమె భర్తగా సీనియర్ హీరో సుమన్ నటిస్తున్నారు.
భర్త ప్రమాదంలో చనిపోవడంతో తన పిల్లలను సుధ ఏ విధంగా పెంచిందనే కంటెంట్ తీసుకొని ఎమోషనల్ ఎలిమెంట్స్ జొప్పిస్తూ ఈ సినిమా రూపొందిస్తున్నారు.కేజేఎస్ రామా రెడ్డి సినిమాకు కథ అందించగా శ్రీ వాసవి మూవీస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో సుధ, సుమన్, రఘు బాబు, పోసాని కృష్ణ మురళి లాంటి ఫేమస్ తారాగణం పాల్గొంటుండటం విశేషం.

