పదేళ్లయినా ఏపీకి నో క్యాపిటల్!

33
- Advertisement -

ఏదైనా ఒక దేశానికైనా, రాష్ట్రనికైనా రాజధాని అనేది ఒక గుండె లాంటిదని చెప్పవచ్చు. దేశాల లేదా రాష్ట్రాల ఆర్థికాభివృద్ది, తలసరి ఆదాయం, ఉద్యోగాల రూపకల్పన, పెట్టుబడులు.. ఇలా డెవలప్ మెంట్ కు సంబంధించిన ప్రతి అంశం కూడా రాజధాని పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే రాజధాని అనేది అత్యంత కీలకం. కానీ ఆంధ్ర ప్రదేశ్ విషయానికొస్తే పైన చెప్పిన అంశాలన్నీకి పూర్తి భిన్నం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడూ హైదరబాద్ క్యాపిటల్ తో వరల్డ్ మ్యాప్ లో ఓ ప్రత్యేక స్థానం ఉండేది. కానీ 2014లో రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అభివృద్ది చెందిన హైదరబాద్ తెలంగాణకు సొంతం కావడంతో ఏపీకి రాజధాని కొరత ఏర్పడింది.

అయితే విభజన హామీల ప్రకారం హైదరబాద్ ను పదేళ్ళు ఉమ్మడి రాష్ట్రాల రాజధానిగా ఉంచినప్పటికి.. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక రాజధాని రూపకల్పనకే మొగ్గు చూపింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో తర్జన భర్జనల తరువాత అమరావతిని రాజధానిగా ప్రకటించారు. దానినే డెవలప్ మెంట్ చేసేందుకు ఆసక్తి చూపించారు. కానీ 2019 వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం.. వైసీపీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. ఇక సి‌ఎం గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో తీసుకొచ్చిన కన్ఫ్యూజన్ అంతా ఇంతా కాదు.

రాష్ట్రంలో అన్నీ వైపులా అభివృద్ది జరిగాలని.. అందుకోసం పరిపాలన వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని ఎక్కడ లేని మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధాని గా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూల్.. ఇలా మూడు రాజధానులను ప్రకటించి గందరగోళనికి గురి చేశారు. అయితే త్రీ క్యాపిటల్స్ విషయంలో వ్యతిరేకత ఏర్పడడంతో కోర్టు ఆ అంశాన్ని ప్రస్తుతం హోల్డ్ లో పెట్టింది. ఇదిలా ఉంచితే మళ్ళీ ఇప్పుడు విశాఖ రాజధానిగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. దీంతో ఏది రాజధాని అని తేల్చుకోలేక ఏపీ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి రాష్ట్రం విడిపోయి పదేళ్లయిన ఇంకా రాజధాని ఏదో తెలియని స్థితిలో ప్రజలు ఉంటే.. స్థిరమైన క్యాపిటల్ ను నిర్మించలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read:Telangana BJP:బీజేపీ లిస్ట్ రెడీ.. ?

- Advertisement -