అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు!

43
shah
- Advertisement -

కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా నిరసలు వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్నివీర్లకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు వెల్లడించింది. సీఏపీఎఫ్‌ , అసోం రైఫిల్స్‌లో అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు తెలిపింది కేంద్రం.

అగ్నిపథ్‌ ద్వారా ఆర్మీకి ఎంపికై నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపారు. ఈ రెండు దళాల్లో నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని అగ్నివీరులకు 3 ఏళ్ల పాటు పెంచుతామని కేంద్రం తెలిపింది. అగ్నివీర్ తొలి బ్యాచ్ వారికి .. కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో గరిష్ట వయో పరిమితి 5 ఏళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.

ఇక ఇప్పటికే ఉద్యోగార్థుల ఆందోళన నేపథ్యంలో వయోపరిమితిని సైతం పెంచింది కేంద్రం.

- Advertisement -