ఒడిశాలోని కటక్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎస్‌సీబీ మెడికల్ కాలేజీ ట్రామా కేర్ ఐసీయూలో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 10 మంది రోగులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రోగులను రక్షించే క్రమంలో ఆసుపత్రికి చెందిన సిబ్బందిలో 11 మంది కాలిన గాయాలు పొందినట్లు సమాచారం.
ఈ ఘటన సోమవారం ఉదయం సుమారు 3 గంటల సమయంలో ట్రామా కేర్ విభాగం మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించడంతో జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది ట్రామా కేర్ ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులేనని అధికారులు తెలిపారు. మంటలు చెలరేగిన వెంటనే ఆసుపత్రి ఫైర్ సేఫ్టీ వ్యవస్థ పనిచేయడం ప్రారంభించగా, అగ్నిమాపక సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. మూడు ఫైర్ ఇంజిన్లను సంఘటన స్థలానికి పంపించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ సమయంలో ఆసుపత్రిలో తీవ్ర గందరగోళం నెలకొంది. రోగుల బంధువులు భయాందోళనలకు గురై ఎటు వెళ్లాలో తెలియక పరుగులు తీశారు. ఫైర్ సర్వీస్ సిబ్బంది, పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది కలిసి ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులను బయటకు తీసి ఆసుపత్రిలోని ఇతర విభాగాలకు తరలించారు. తీవ్ర స్థితిలో ఉన్న రోగులను న్యూ మెడిసిన్ ఐసీయూకు తరలించారు.
Also Read:ఘనంగా కుల్దీప్ యాదవ్ వివాహాం
ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ , ఆరోగ్య శాఖఖ మంత్రి ముఖేష్ తో కలిసి ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన రోగులను పరామర్శించారు.

