అమెరికాలో సినీ ప్రపంచం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. అమెరికాలోని డాల్బీ థియేటర్ వేదికగా 98వ అకాడమీ అవార్డుల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ప్రపంచం నలుమూలల నుంచి సినీ ప్రముఖులు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకకు హాజరై మెరుపులు మెరిపించారు.
ఈ ఏడాది అవార్డుల కార్యక్రమంలో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’, ‘సిన్నర్స్’ సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలు విభాగాల్లో ఈ చిత్రాలు మంచి పోటీ ఇచ్చాయి. ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రంలో నటనకు గాను ప్రముఖ నటుడు సీన్ పెన్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్నారు. అదే విధంగా ‘వెపన్స్’ చిత్రంలో తన అద్భుత నటనకు గాను నటి Amy Madigan ఉత్తమ సహాయ నటిగా అవార్డును దక్కించుకున్నారు.
ఇక ‘సిన్నర్స్’ సినిమా ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. అద్భుతమైన చిత్రీకరణ, విజువల్ నాణ్యతకు ఈ అవార్డు లభించింది. మరోవైపు భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన Avatar: Fire and Ash చిత్రం ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డును గెలుచుకుంది.
Also Read:ఘనంగా కుల్దీప్ యాదవ్ వివాహాం
ఈ ఏడాది ఆస్కార్ అవార్డులు సినీ ప్రపంచంలో కొత్త ప్రతిభను, అద్భుత సాంకేతిక నైపుణ్యాన్ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఈ వేడుకను ఆసక్తిగా వీక్షించారు.

