ఆయా కాదు రాక్షసి…చిన్నారిని నేలకేసి కొట్టింది

222
10-Month-Old Beaten by Care Taker at Day Care
- Advertisement -

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఉండటంతో తమ పిల్లలను నమ్మకంతో కేర్ సెంటర్‌లకు అప్పగిస్తారు. తిరిగి డ్యూటీ నుంచి రాగానే తమ పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్తారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి కేర్‌ సెంటర్‌లు డబ్బులు దండు కోవడానికి కుప్పలు కుప్పలుగా వెలిశాయి. కానీ కేర్‌ సెంటర్‌లో మన పిల్లల్ని నిర్వాహకులు జాగ్రత్తగా చూసుకుంటున్నారో లేదు మనకు తెలియదు. నవీ ముంబైలోని పూర్వా ప్లేస్కూల్‌లో ని కేర్‌ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన దురాగతం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది.

తల్లి దగ్గర లేనప్పుడు తల్లికంటే ఎక్కువ ప్రేమగా చూసుకోవాల్సిన కేర్ టేకర్ అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. 10 నెలల పసిపాపను గొడ్డును బాదినట్లు చితక బాదింది. ఆడుకుంటున్న పిల్లను లాగిలాగి మరి కొట్టింది. కాగితాలను విసిరేసినట్లు విసిరేసింది. దెబ్బలు తగిలి నొప్పితో పాప ఏడుస్తున్నా వదిలిపెట్టకుండా కొట్టింది. పసిబిడ్డ అన్న కనికరం చూపించకుండా కొట్టిన చోటే కొట్టింది. నవీ ముంబాయ్‌లోని పూర్వా ప్లేస్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

10-Month-Old Beaten by Care Taker at Day Care

తన బిడ్డ ఒంటి నిండా గాయాలు చూసిన పాప తల్లి ఈనెల 21న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్వా ప్లే స్కూల్ సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే పాపను కేర్ టేకర్ అఫ్సానాషేక్ కొడుతూ కనిపించింది. వెంటనే ఆమెను అరెస్ట్ చేసి 14రోజుల రిమాండ్‌కు పంపించారు. ఈ సెంటర్ ప్రారంభించి కేవలం 5నెలలే అయ్యింది. అఫ్సానా ఉద్యోగంలో చేరి నెలరోజులు అయ్యింది. చిన్నపిల్లలందరినీ అఫ్సానా కొడుతోందని పోలీసులు ఈ సీసీ పుటేజీ ద్వారా గుర్తించారు. ఆమెను కఠినంగా శిక్షించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.

10-Month-Old Beaten by Care Taker at Day Care

ఈ వీడియో చూసిన తర్వాత కేర్‌సెంటర్ నిర్వాహకుల్లో ఎంతటి కేర్ ఉందో తెలుస్తోందని పలువురు మండిపడుతున్నారు. కేవలం డబ్బులు దండుకోవడంపై ఉన్న శ్రద్ద పసిపిల్లలను చక్కగా చూసుకోవాలని ఉండదని సోషల్‌ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయాల ఎంపికలోనూ అదే అలసత్వన్ని వహిస్తున్నాయని కేర్‌ సెంటర్ల పై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే సీసీ కెమెరాలు ఉంటాయి కాని వాటిపై నిఘా ఉండదని కొందరు తల్లి దండ్రులు అభిప్రాయ పడుతున్నారు.

10-Month-Old Beaten by Care Taker at Day Care

పాపం ఈ చిన్నారి గాయాలతో బయటపడింది కాబట్టి సరిపోయింది. మరేదైనా ఘోరం జరిగితే ఆతల్లిదండ్రులను ఓదార్చేదెవరు. మెట్రోనగరాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న కేర్ సెంటర్లపై పోలీసుల నిఘా ఉండదని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఇంకొంత మంది అనవసర విషయాల్లో పోలీసులు ముందుటారు కానీ ఇలాంటి విషయంల్లో మాత్రం కాస్తా వెనకడుగు వేస్తారని పోలీసు బాసులపై సోషల్‌ మీడియాలో కామెంట్ల్‌ పోస్టు చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా కుప్పలు కుప్పలుగా సెంటర్లు వెలుస్తునే ఉన్నాయి. ఫలితంగా ఆయా సెంటర్లలో ఎవరు పనిచేస్తున్నారో వారు ఎలాంటి వారు అని కూడా తెలియకుండా వారిని పనిలో పెట్టుకుంటున్నారు. నాలుగు డబ్బులు పడేస్తే ఎవరో ఒకరు ఆయాగా పనిచేస్తారనేది కేర్‌ సెంటర్‌ నిర్వాహకుల ఆలోచన అని తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు. నమ్మకంతో తమ పిల్లల్ని కేర్‌ సెంటర్‌లో వదిలేస్తే వెళ్తే ఫలితంగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -