శ్రీదేవి ఒప్పుకుందా..?

214
hanvi in between Mom & Boyfriend!
hanvi in between Mom & Boyfriend!
- Advertisement -

శ్రీదేవి, బోనీ కపూర్‌ దంపతుల పిల్లలు జాన్వి కపూర్‌, ఖుషీ కపూర్‌లు. ఇప్పుడిప్పుడు యుక్తవయస్సుకు వస్తున్న ఈ ఇద్దరు అమ్మాయిలు.. సోషల్‌ మీడియాలో తమ పోస్టుల ద్వారా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. గత కొంత కాలంగా జాన్వి రెచ్చిపోయి అందాలను ఆరబోయడమే కాకుండా బాయ్‌ ఫ్రెండ్‌తో పార్టీలకు వెళుతూ బాగానే ఎంజాయ్‌ చేస్తోంది. అయితే సినిమాల్లోకి రాకుముందే ఇంతగా రెచ్చిపోయి పబ్‌లకు వెళ్ళడమే కాకుండా జాన్వి కపూర్ తన బాయ్ ఫ్రెండ్ తో లిప్ లాక్ చేసి సంచలనం సృష్టించింది. తాజాగా మరో ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అయితే ఈ ఫొటోలో జాన్వీ.. జాన్వీ బాయ్‌ ఫ్రెండ్‌ మాత్రమే కాదు.. ఏకంగా శ్రీదేవి ఫ్యామిలీ ఉంది.

jhanvi-kapoor

అయితే శిఖర్‌తో తన కూతురు డేటింగ్‌ చేయడం శ్రీదేవికి ఏమాత్రం నచ్చడం లేదని కథనాలు వచ్చాయి. ఈ కథనాలకు పుల్‌స్టాప్‌ పెడుతూ… షారుఖ్ ఖాన్, అలియా భట్ లు నటించిన ‘డియర్ జిందగీ’ స్క్రీనింగ్ కు శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులతో పాటు జాన్వి, శిఖర్‌ లు కలిసి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో శ్రీదేవి, బోనీ కపూర్లు జాన్వి, శిఖర్ ల రిలేషన్ షిప్ ను అంగీకరించారని తెలుస్తోంది. కాగా, శిఖర్‌ ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్‌కుమార్‌ షిండే మనవడు.

sridevi

- Advertisement -