ఐస్ బకెట్, రైస్ బకెట్ చాలెంజ్ మాదరిగా.. ఇప్పుడు ‘హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్ అనే ఛాలెంజ్‌ని‘ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్‌లో కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పాల్గొంటున్నారు. ఈ ఛాలెంజ్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.
ఇక ఈ ఛాలెంజ్‌ని మలయాల మెగాస్టార్ మోహన్‌లాల్ స్వీకరించి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు సవాల్ విసిరాడు. ఈ సవాల్ ను స్వీకరించిన ఎన్టీఆర్ జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో వర్కవుట్స్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేశాడు.ఇక ఎన్టీఆర్ కూడా కళ్యాణ్ రామ్, మహేష్ బాబు, రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివలకు ఈ ఛాలెంజ్ విసిరాడు.
ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌కి అన్న కళ్యాణ్ రామ్ స్పందించాడు. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ నాన్న అంటూ జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోని షేర్ చేశాడు. ఇక కళ్యాణ్ రామ్ కూడా అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, రామ్‌లకు ఛాలెంజ్ విసిరాడు.
మరోవైపు కళ్యాణ్ రామ్ నా నువ్వే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేశాయి. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు.
Challenge accepted nanna @tarak9999 .. Here's a glimpse of my daily fitness routine with @afzalfitnesspal. Stay fit. Stay healthy. I now nominate @alluarjun @ramsayz @IamSaiDharamTej for the #HumFitTohIndiaFit challenge pic.twitter.com/4odbum3gux
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) June 2, 2018