- Advertisement -
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరగాలంటే ఖైరతాబాద్ వినాయకుడిని ముందే నిమజ్జనం చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వినాయక చవితి, బక్రీద్ పండుగలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా హైదరాబాద్‌లో సెప్టెంబర్15న గణేష్ నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. అలాగే తొలుత ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనం చేయాలని నిర్ణయించగా…, ఖైరతాబాద్ విగ్రహం ఊరేగింపు ఉదయమే ప్రారంభించాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ, మెట్రో రైలు, పోలీసులు సమన్వయంతో పని చేయాలన్నారు. దక్షిణ మండల పరిధిలో 15 అడుగుల విగ్రహాలకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. నిమజ్జనం సందర్భంగా రోడ్లు మరమ్మతు చేయాలని జీహెచ్ఎంసీకి పోలీసులు విన్నవించారు.
ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
- Advertisement -