సంజయ్‌కి ఉలికిపాటు ఎందుకు..? : సతీష్ రెడ్డి

2
- Advertisement -

రాష్ట్రంలో ఆర్ ఎస్ బ్రదర్స్ గుట్టు మరోసారి బయటపడింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మోడీతో యుద్ధం చేస్తోంటే.. తెలంగాణలో మాత్రం రెండు పార్టీలు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయి. ఒకరికి ఒకరు తోడూ నీడగా, ఒకరిపై ఈగ వాలకుండా మరొకరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలపై కేటీఆర్ పాదయాత్ర చేస్తానంటే.. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే ముందే బండి సంజయ్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారు.? రేవంత్ ప్రభుత్వ నిర్వాకం బయటపడి, ఆయనకు ఇబ్బంది వస్తుందని సంజయ్ బాధపడుతున్నట్టే కనిపిస్తున్నది.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.. కేటీఆర్ పాదయాత్రపై వాళ్లు మొదట స్పందించాలి. కానీ అందరికంటే ముందే బండి సంజయ్ ఎందుకు స్పందిస్తున్నారు.? రేవంత్ సర్కారుకు చిన్న ఇబ్బంది వచ్చినా.. బండి సంజయ్ ఓర్చుకోవడం లేదు. అంటే ఇది ఆర్ఎస్ బ్రదర్స్ మధ్య ఉన్న అవినాభావ సంబంధం. ఇవన్నీ కాదు.. కేటీఆర్ తో పాటు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ రాష్ట్రమంతటా పాదయాత్ర చేయండి. ప్రజల స్పందన ఏంటో మీకు తెలుస్తుంది. 420 హామీలిచ్చిన కాంగ్రెస్ పై, వాటి గురించి, ప్రజల సమస్యల గురించి కనీసం మాట్లాడని బిజెపి గురించి ప్రజలు ఎనమనుకుంటున్నారో తెలుస్తుంది. ఇప్పుడు RS Brothers ఇద్దరూ కలిసి మోకాళ్ళ యాత్ర చేసిన ఇద్దరికి డిపాజిట్లు కూడా రావు ఇప్పుడు. ఆర్ఎస్ బ్రదర్స్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా తెలుస్తుంది. అంతేగానీ.. ఇలా రేవంత్, సంజయ్ చెట్టాపట్టాలేసుకుని దాగుడుమూతలు ఆడుతూ, ప్రజల కళ్లకు గంతలు కడదామని చూస్తే.. నమ్మడానికి ప్రజలు ఏం అమాయకులు కాదు అని మండిపడ్డారు.

Also Read:KTR: డైవర్షన్ పాలిటిక్స ఇంకెన్నాళ్లు?

- Advertisement -