ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా వర్మ తెరకెక్కించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఏపీలో ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడగా తెలంగాణలో రిలీజైంది. పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్‌ను కొల్లగొడుతోంది. చాలాకాలం తర్వాత వర్మ తన మార్క్ మూవీని తెరకెక్కించారని అంతా ప్రశంసలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో స్పందించిన వర్మ ట్విట్టర్ ద్వారా చంద్రబాబుకు చురకలంటించారు.నారా లోకేశ్ టీడీపీకి అసలైన వారసుడు కాదన్న వర్మ ఆ పార్టీకి నిజమైన ఏకైక వారసుడు తారక్ అని ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్‌తోనే భవిష్యత్తు అని తెలిపారు. నిజాయతీపరులైన, అసలైన ఎన్టీఆర్ అభిమానులంతా లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చంద్రబాబు పాత్రను చూసిన తర్వాతే టీడీపీకి ఓటేయాలని కోరారు.
రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. తారక్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తుండగా చంద్రబాబు అనుచరుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేవలం పబ్లిసిటీ కోసమే వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇక ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో సుప్రీం కోర్టుకు వెళ్లారు నిర్మాతలు.