అలీ అందుకే వైసీపీలో చేరారు:పవన్

806
pawan ali
- Advertisement -

తన సన్నిహితుడు అలీ వైసీపీలో చేరడంపై స్పందించారు జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన పవన్ తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటి ఉన్న అలీ ఎక్కడికి వెళ్లాలన్నది ఆయన ఇష్టమన్నారు. జగన్ బలమైన నాయకులు అని అలీకి అనిపించి ఉండొచ్చు లేదా టీడీపీ పదవి ఇవ్వకపోవడం కూడా కారణం కావచ్చు అందుకే అలీ వైసీపీలో చేరరాని తెలిపారు.

జనసేన పార్టీ తరఫున చిరంజీవి ప్రచారం చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. రాజకీయాలను అన్నయ్య, తాను వేరు వేర్వేరు కోణాల్లో చూస్తామని తెలిపారు పవన్. జనసేన తరఫున నటులెవరూ ప్రచారం చేయకపోవడానికి కారణమేంటో నాకు తెలీదు. ..కానీ నాకంటే ప్రజాకర్షణ ఉన్న నటులున్నారని తెలిపారు. తాను సినీనటుల మీద ఆధారపడలేదని రాజకీయ సిద్ధాంతాల మీద ఆధారపడతానని పవన్ తెలిపారు.

అనంతపురం నుంచే తాను పోటీ చేయాలని భావించానని అందుకే అక్కడ పార్టీ ఆఫీసును కూడా ప్రారంభించమన్నారు. కానీ రాష్ట్రం మొత్తం తిరగాలంటే.. అనంతపురంలో ఎలక్షనీరింగ్ నడిపే వ్యవస్థ లేదని.. దీంతో అనంతపురం నుంచి పోటీ చేయలేకపోయానని పవన్ తెలిపారు. స్టార్ డమ్ అనేది జనాలు రావడం వరకే పని చేస్తుందని తెలిపిన పవన్ రాజకీయ అవగాహన, భావజాలం, విధాన నిర్ణయాలపై స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు.

- Advertisement -