రిలయన్స్ జియో ప్రవేశంతో భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రిలయన్స్ కంపెనీ అందించే జియో సిమ్ల కోసం దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ డిజిటల్, డిజిటల్ ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్లు, లైఫ్ మొబైల్ స్టోర్ల ముందు భారీ క్యూ లైన్లు స్వాగతం పలుకుతున్నాయి. 4జీ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత సిమ్‌తోపాటు ప్రివ్యూ ఆఫర్‌ను వర్తింపజేస్తుండడంతో కస్టమర్లతో ఈ స్టోర్లు కిటకిటలాడుతున్నాయి. ఉచిత సిమ్ చేతికొచ్చిందా జియో ప్రివ్యూ ఆఫర్‌తో 90 రోజులపాటు అపరిమిత డేటా, కాల్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
అయితే జియో సిమ్ కొనే ముందు ఒక్కసారి ఆలోచించండని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో రిలయన్స్ తన కస్టమర్లకు లిమిటెడ్ టాక్ టైమ్‌తో సెల్ ఫోన్లు అమ్మిన విషయం తెలిసిందే. ఫోన్లు తక్కువ ధరకే వస్తున్నందునా.. జనాలు ఎగబడి ఫోన్లు కొన్నారు. తరువాత బిల్లులు లక్షల్లో రావడంతో ఖంగు తిన్నారు రిలయన్స్ కస్టమర్లు. అపుడు రిలయన్స్ తన ఫోన్ బిల్లులను వసూలు చేసుకునేందుకు గుండాలను, మాఫియాను వాడుకొని తన బిల్లులను వసూలు చేసుకుంది. అయితే ఈ సారి 4జీ అంటూ వచ్చిన జియో సిమ్ తీసుకుంటే అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఫ్రీగా రాదు. ఖచ్చితంగా కొన్ని ఖండీషన్లు ఉంటాయి. అవి తెలుసుకున్నాకే.. జియో తీసుకోండని చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు.
హైదరాబాద్‌లో గురువారం ఒక్కరోజు బిగ్ సి స్టోర్లలో 2,500లకుపైగా, లాట్ మొబైల్స్ ఔట్లెట్లలో అదే స్థాయిలో 4జీ స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యా యి. 4జీ ఫోన్ కొన్న వినియోగదార్లకు ఈ స్టోర్లలో అప్పటికప్పుడు సిమ్‌ను ఇస్తున్నారు. ఇక జియోతో తమ ఫోన్లను అమ్మేసుకోవాలని మొబైల్ ఫోన్ కంపెనీలు జియో జట్టు కడుతున్నాయి. జియోతో తొలుత శామ్సంగ్, ఎల్జీ.. తర్వాత జియోనీ, కార్బన్, లావా, ఆసస్, టీసీఎల్, ఆల్కటెల్, ప్యానాసోనిక్, మైక్రోమ్యాక్స్, యూ వంటి బ్రాండ్లు చేతులు కలిపాయి. శామ్సంగ్ తాజాగా జియో సిమ్‌తో ఫీచర్ ఫోన్ కస్టమర్లను ఆకట్టుకోవడాని రూ.4,590లకే జెడ్2ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.