పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్విట్టర్ వేదికగా సమాజంలో జరిగే మంచి చెడులతో పాటు తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది రేణూ.
జ్ఞాపకాలు ఎప్పుడూ తియ్యగానే ఉంటాయి. అందుకే వాటిని నెమరు వేసుకున్నప్పుడల్లా మరోసారి ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం! గతంలో జరిగిన కొన్ని సంఘటనలు తల్చుకున్న ప్రతీసారీ ఆనందాన్ని పంచుతూ ఉంటాయి. అయితే ఒక సంఘటన అలాంటి జ్ఞాపకంగా మారాలంటే అది ఎంతో ప్రత్యేకమైనదిగా ఉండాలి కదా.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అతని మాజీ భార్య రేణూ దేశాయ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఒక చోట కలిస్తే ఎలా ఉంటుంది..? ఎప్పుడో 2003 లో జరిగిన ప్రత్యేక సందర్భమది. ఓ డిన్నర్ ఫంక్షన్ లో వీళ్ళు ముగ్గురూ కలిశారు. మొత్తం ఇండియన్ క్రికెట్ టీమ్ అంతా కూడా ఈ ఫంక్షన్ లో పాల్గొన్నారు. కాగా రేణూ దేశాయ్..తాజాగా నాటి ఈ ఫోటోను తన ట్విటర్ లో పోస్ట్ చేసి తన అభిమానులతో పంచుకున్నారు. దీన్ని మీరు చూస్తారని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు. తన మాజీ హబ్బీతో పంచుకున్న తీపి జ్ఞాపకాలను ఆమె ఇలా గుర్తు చేశారు.
అంతే కాకుండా పవన్ ఫోటోని పోస్ట్ చేసిన రేణూదేశాయ్ ఆ ఫోటోకి కామెంట్ పెట్టింది. ‘ఇది నా ఫేవరేట్ ఫోటో. ఆయన కళ్ళలోని తీవ్రతని చాలా ఇష్టపడతాను. ఈ ఫోటోలో ఆయన స్కిన్ టోన్ ఒరిజనల్. నేను ఎడిట్ చేసింది కాదని తెలిపింది’ రేణూ. 2010లో పవన్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటే తాను ఈ ఫోటోను తీశానని తెలిపింది. అంతేకాదు తాజాగా కళ్యాణ్ గారితో తాను మాట్లాడినట్టు చెప్పిన రేణూ తాను తీసిన మరి కొన్ని పిక్స్ ని షేర్ చేసేందుకు పవన్ పర్మీషన్ ఇచ్చారని ట్వీట్ చేసింది.
ఆ ఫోటోస్ ని త్వరలోనే షేర్ చేస్తానంటూ రేణూ పేర్కొంది. అయితే అభిమానులు పవన్ బర్త్ డే కానుకగా నలుగురు ఉన్న ఫోటోని షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి రేణూ, పవన్ కి బర్త్ డే గిఫ్ట్ గా ఏం ఇస్తుందో చూడాలి.