మాజీ సీఎం కోరిక తీర్చనున్న శృతిహాసన్..

259
Shruthi Hassan in Kannada JAGWAR movie
Shruthi Hassan in Kannada JAGWAR movie
- Advertisement -

కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీ కి పరిచయం అయిన శృతిహాసన్, కెరియర్ మొదట్లో ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకొని ఆ తరవాత గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ ను తన ఖాతా లో వేసుకుంది. ఆ తర్వాత వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ భామ,. ప్రస్తుతం తన తండ్రి తో శభాష్ నాయుడు తో పాటు నాగ చైతన్య తో ప్రేమమ్ సినిమాల్లో నటిస్తుంది.

తాజాగా ఈమె మరో బంపర్ ఆఫర్ కు ఒకే చెప్పిందని సమాచారం. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ హీరో గా దాదాపు 75 కోట్ల తో తెరకెక్కుతున్న జాగ్వార్ చిత్రం లో శృతిహాసన్ ఐటెం సాంగ్ చేయడానికి ఒకే చెప్పిందట. ఈ సాంగ్ కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. భారీగా అంటే అంతా ఇంతా కాదు.. అక్షరాల 5 నిమిషాల కోసం 2 కోట్లు డిమాండ్‌ చేసిందనే టాక్‌ వినిపిస్తోంది.

మాజీ ప్ర‌ధాని దేవేగౌడ మ‌న‌వ‌డు నిఖిల్ కుమార్ జాగ్వ‌ర్ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సంగ‌తి తెలిసిందే. 75 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో దీప్తి హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇందులో ఓ స్పెష‌ల్ సాంగ్ కోసం శృతిని అప్రోచ్ అయ్యారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. సినిమాకే 70 కోట్లు పెడుతున్నారు.. తాను ఎంత‌డిగినా ఇస్తారులే అనుకుందో ఏమో గానీ ఐదు నిమిషాలు చిందేయ‌డానికి 2 కోట్లు అడిగిందనే గుసుగుసలు వినిపిస్తున్నాయి. ఎంత భారీ బ‌డ్జెట్ అయినా.. మ‌రీ ఒక్క పాట కోసం 2 కోట్లంటే ఆలోచ‌న‌లో ప‌డ‌తారు కదా..! వాళ్లు కూడా ప‌డ్డారట.

అందుకే ప్ర‌స్తుతం శృతిహాస‌న్ ఆఫ‌ర్ ను పెండింగ్ లో పెట్టారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇంత‌కుముందు ఆగ‌డు, తెవార్ సినిమాల్లో ఈ భామ చేసిన స్పెష‌ల్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అప్పుడు ఇమేజ్ ఉన్న హీరోల‌తో ఆడిపాడింది శృతి.. కానీ ఇప్పుడు మాత్రం క్యాష్ కోసం క్రేజ్ నే ఫణంగా పెట్టేస్తోంది. ఎంతైనా దీపం ఉన్న‌పుడే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌నే సామెత పెద్దోళ్లు ఎందుక‌న్నారో ఇప్పుడు అర్థ‌మ‌వుతుంది క‌దూ శృతి తెలివి తేట‌ల్ని చూస్తుంటే..!

 

 

 

 

- Advertisement -