పశ్చిమబెంగాల్ భవానీపూర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. . భవానీపూర్‌లో పోలింగ్ ముగిసేవరకు 144 సెక్షన్ విధించగా భారీగా 15 కంపెనీల కేంద్ర బలగాల్ని కూడా పోలింగ్ స్టేషన్ల వద్ద మోహరించింది ఈసీ. భవానీపూర్‌తో పాటు బెంగాల్‌లో మరో రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది.సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఇక భవానీపూర్ నుండి రెండుసార్లు ఇక్కడి నుండి గెలిచిన మమతా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే మూడోసారి నందిగ్రామ్ నుండి పోటీచేసి బీజేపీ నేత సువేంద్ అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఓడినప్పటికి మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు మమతా.
ఆరునెలల్లోగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉండగా ఇందుకోసం భవానీపూర్ నియోజకవర్గంలో గెలిచిన వ్యవసాయ మంత్రి శోబన్‌దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేశారు. ఆ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో మమత పోటీ చేస్తున్నారు.
ఇక మమతను ఓడించి సీఎం కాకుండా చేయాలని బీజేపీ ఎన్నికల ప్రచారంలో పటిష్ట వ్యూహాన్నే రచించారు. భవానీపూర్‌లో ప్రియాంక తిబ్రేవాల్‌ను బరిలో దింపారు ప్రచారానికి చివరి రోజు కూడా టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణలు జరిగాయి.