రాజస్థాన్‌పై ఆర్సీబీ గెలుపు..

61
maxwell

ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌లో భాగంగా రెండో విజయాన్ని నమోదుచేసింది ఆర్సీబీ. రాజస్థాన్‌ విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కొల్పోయి 153 పరుగులు చేసి గెలుపొందింది. మ్యాక్స్‌వెల్‌ (30 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50 నాటౌట్‌), శ్రీకర్‌ భరత్‌ (35 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 44) రాణించడంతో కోహ్లీ సేన 7 వికెట్లతో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసింది. దీంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 149/9 స్కోరు చేసింది. ఎవిన్‌ లూయిస్‌ (37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58), యశస్వి జైస్వాల్‌ (31) రాణించారు. హర్షల్‌ పటేల్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. షాబాజ్‌ అహ్మద్‌, యజ్వేంద్ర చాహల్‌ చెరో రెండు వికెట్లు తీశారు. చాహల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది.