రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా కొత్త చిత్రం `డి.జె..దువ్వాడ జగన్నాథమ్` సోమవారం హైదరాబాద్ లో లాంచనంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ రూపొందుతున్న 25వ సినిమా ఇది. దైవ సన్నిధానమ్ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో….
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ – `డి.జె…దువ్వాడ జగన్నాథమ్` ఈరోజు లాంచనంగా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇది దిల్‌రాజుగారి బ్యానర్‌లో వస్తున్న 25వ సినిమా. ఆయనతో గబ్బర్ సింగ్ సినిమా నుండి అనుబంధం కొనసాగుతుంది. వరుసగా సినిమాలు చేస్తున్నాను. ఆర్య సినిమా నుండి అల్లుఅర్జున్‌తో సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఇప్పటికీ ఆ కోరిక తీరింది. బన్నికి థాంక్స్. అలాగే ఎప్పుడు అడిగిన తన విలువైన సమయాన్ని కేటాయించడమే కాకుండా అల్లు అరవింద్‌గారు తన విలువైన సలహాలను కూడా అందిస్తుంటారు. అందుకు ఆయనకు నా స్పెషల్ థాంక్స్. డి.జె.దువ్వాడ జగన్నాథమ్ సినిమా రెగ్యులర్ సెప్టెంబర్ నుండి జరుగుతుంది. అలాగే సినిమాను ఏప్రిల్ మొదటివారంలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం” అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ ”ఈరోజు బన్ని హీరోగా మా బ్యానర్‌లో డి.జె…దువ్వాడ జగన్నాథం సినిమా ప్రారంభమైంది. ఆర్య, పరుగు తర్వాత బన్నితో ఈ సినిమా హ్యాట్రిక్ మూవీ కావడం, మా బ్యానర్‌కు ఇది 25వ సినిమా కావడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఇది కూడా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. హరీష్ శంకర్‌తో గబ్బర్ సింగ్ నుండి మంచి పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి తనతో చేసిన ట్రావెల్‌లో మంచి అనుబంధం ఏర్పడింది. మా బ్యానర్ లో హరీష్ తో వరుస సినిమాలు చేస్తున్నాం. హరీష్ దర్శకత్వంలో చేస్తున్న మూడో సినిమా. తప్పకుండా మంచి హిట్ సినిమాను రూపొందించేలా అందరం కష్టపడి వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.
ఈ చిత్రానికి ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్: రవీందర్, ఫైట్స్:రామ్-లక్ష్మణ్, సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, స్క్రీన్‌ప్లే: దీపక్ రాజ్ నిర్మాత: దిల్‌రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్.