సింధు, సాక్షిలకు ఖేల్‌ రత్న

305
- Advertisement -

రియో ఒలింపిక్స్‌ రజతం గెలిచిన హైదరాబాదీ షట్లర్ వివి సింధు ఖేల్ రత్న పురస్కారం అందుకుంది. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే ఆటగాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఖేల్ రత్న అవార్డు అందజేస్తుంది. ఒలింపిక్స్‌లో రజత పతక విజేత పీవీ సింధు, కాంస్య పతకం సాధించిన సాక్షి మలిక్‌, అద్భుత ప్రదర్శన చేసిన దీపా కర్మాకర్‌, జీతూరాయ్‌లకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారాలను ప్రదానం చేశారు.

sindhu

సాక్షి మాలిక్ బ్రాంజ్ మెడల్ గెలిచింది. దీపా కర్మాకర్ తృటిలో పతకం కోల్పోయిన భారతీయుల మనసులను గెలుచుకుంది. ఇక ఈ అవార్డుల కార్య‌క్ర‌మంలో భాగంగా 15 మంది అర్జున అవార్డు అందుకున్నారు. అర్జున అందుకున్న‌వారిలో క్రికెట‌ర్ ర‌హానే, అథ్లెట్ ల‌లితా బాబ‌ర్‌తో పాటు మ‌రికొంద‌రు ఉన్నారు. ఇక జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కోచ్ బిశ్వేశ్వర్ నంది, మరో కోచ్ నాగపురి రమేష్ ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు. క్రీడా దినోత్స‌వం సంద‌ర్భంగా సోమ‌వారం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఈ అవార్డులు అంద‌జేశారు. ఈ అవార్డుల కార్య‌క్ర‌మానికి కోచ్ గోపీచంద్‌, త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి హాజ‌రైంది పీవీ సింధు.

sakshi

khel

deepa

కాగా,ఇవాళ న్యూ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీని పీవీ సింధు, కోచ్ గోపీచంద్, రెజ్లర్ సాక్షిమాలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, షూటర్ జీతూరాయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రియో ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రతిభను కనబరిచి దేశ ఖ్యాతిని మరోసారి ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన పీవీ సింధు, సాక్షిమాలిక్, దీపాకర్మాకర్‌, జీతూరాయ్ లను ప్రధాని మోదీ అభినందించారు.

14068119_970126569765511_5873657076231675058_n

- Advertisement -