కరోనా విజృంభణ నేపథ్యంలో సమష్టిగా మనం చేస్తోన్న ప్రయత్నాలు చాలా మంది ప్రాణాలను కాపాడాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రయత్నాలను కొనసాగించాలని, వైరస్ నుంచి పౌరులను కాపాడాలని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు. ఈ క్రమంలో ప్రధాని పిలుపులో భాగస్వామ్యం అవ్వండి అంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ ట్వీట్ చేసింది. కొవిడ్-19పై పోరాడుతోన్న కరోనా వారియర్స్ కు, ప్రజలను ప్రశంసిస్తూ మోదీ చేసిన ట్వీట్‌ను ఆమె రీట్వీట్ చేసింది.
ఈ ట్వీట్ ను రకుల్ రీట్వీట్ చేస్తూ… “కరోనా నుంచి మనల్ని సురక్షితంగా ఉంచడానికి మూడు ఆయుధాలు ఉపయోగపడతాయి. అవే మాస్కు, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, భౌతిక దూరం. కొవిడ్ పై పోరాటానికి ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపునకు మద్దతిద్దాం. కరోనాపై పోరాడదాం.. మనల్ని మనం సురక్షితంగా ఉంచుకుంటూ మన కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుదాం” అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది.