పవన్ మరదలు ఈమె

251
Pawan-Manasa-
Pawan-Manasa-
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా కాటమరాయుడు ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో తానూ పవన్ కళ్యాణ్ మరదలిగా నటిస్తున్నట్లు వెల్లడించింది నటి మానస హిమవర్శ. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం తెలిపింది. ‘పవన్‌కల్యాణ్‌ మరదలిగా, ఆయన్ను ఇష్టపడే వ్యక్తిగా ఈ చిత్రంలో నేను కనిపిస్తాను. నేను పవన్‌ ఇంట్లోనే ఉంటూ తన సోదరులతో కలిసి ఆయన్ను టీజ్‌ చేస్తుంటా, పట్టులంగా, లంగావోణీలోనే కనిపిస్తా ‘ అంటూ తెలిపింది. పవన్‌ కళ్యాణ్ తో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది.

 hero Pawan Kalyan

ఈ విషయాన్ని మానస స్వయంగా తన సోషల్ మీడియా పేజ్ లో వెల్లడించింది. సినిమా అవకాశం ఎలా వచ్చిందో కూడా చెప్పుకొచ్చింది. ఈ కథ కోసం మాసను అసలు ఆడిషన్ చేయలేదట. నెట్ లో మానస ఫొటోలు చూసిన దర్శకుడు డాలీ… ఎలాంటి ఆడిషన్స్ లేకుండానే పవన్ మరదలి పాత్ర కోసం మానసను సెలక్ట్ చేశాడట. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే.. కాటమరాయుడికి చెందిన నెక్ట్స్ షెడ్యూల్ వివరాల్ని వెల్లడిస్తారు.

 hero Pawan Kalyan

 

 hero Pawan Kalyan

పవన్ కు జోడిగా శ్రుతిహాసన్‌ ఇందులో కథానాయికగా నటిస్తుంది. నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని దర్శకుడు డాలి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శృతిహాసన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

- Advertisement -