గ్లామ‌ర్ షోతో పిచ్చెక్కిస్తోన్న శాన్వి

380
shanvi
- Advertisement -

‘ల‌వ్‌లీ’ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక శాన్వి. ఆ సినిమా విజ‌యం సాధించ‌డంతో.. ఆ త‌రువాత ‘అడ్డా’, ‘రౌడీ’, ‘ప్యార్ మే ప‌డిపోయానే’ వంటి సినిమాలు చేసింది. అయితే శాన్వికి తెలుగులో కంటే ఎక్కువ అవ‌కాశాలు వ‌చ్చింది మాత్రం క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే. ‘ప్రేమ‌క‌థా చిత్ర‌మ్’ క‌న్న‌డ రీమేక్ ‘చంద్ర‌లేఖ‌’తో అక్క‌డి ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైన శాన్వి.. ఆ త‌రువాత ‘అలా మొద‌లైంది’ రీమేక్ ‘భ‌లే జోడీ’లోనూ.. ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్’ రీమేక్ సుంద‌రాంగ జాణ‌లోనూ న‌టించింది.

Shanvi-Srivastava

ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటించలేకపోయినా ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం తెలుగు అభిమానులను పలకరిస్తూనే ఉంది. పండుగల సమయంలో అభిమానులందరికి విషెస్ ని కూడా అందించింది. అయితే ఈ మద్య శాన్వి ఫొటో షూట్స్ తో అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది. సాధారణంగా అమ్మడు ఎక్కువగా గ్లామర్ గా కనిపించడానికి ఇష్టపడదు. కానీ ఈ భామ లిమిట్స్ లో ఉండే ఫ్యాషన్ డ్రెస్సులను వేస్తూ కొత్తగా స్టైలిష్ గా కనిపించడానికి ట్రై చేస్తోంది. ఈ మధ్యనే అమ్మడు ఇచ్చిన ఒక ఫొటో స్టిల్స్ చాలా కొత్తగా ఉన్నాయి. సంప్రదాయాన్ని స్టయిలిష్ డ్రెస్సులతో జోడించి తన సోయగాలను చూపించింది. చీర కట్టులో జీన్స్ ని తగిలించేసి దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసినవారంతా ఈ అమ్మడి అందాలకు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం శాన్వి కన్నడలో రెండు సినిమాలను తమిళ్ లో ఒక సినిమాను చేస్తోంది.

- Advertisement -