గంధంతో.. అందం

379
- Advertisement -

గంధాన్ని మనం ఎక్కువగా పూజల్లో వాడతాం. గంధంనే, చందనము అని కూడా పిలుస్తారు. ఒక విశిష్టమైన సుగంధాన్నిచ్చే వృక్షం ఇది. గంధపు చెక్క నుండి నూనెను తయారు చేస్తారు. దీనిని పరిమళాలకు మరియు ఔషధాల కోసం ఉపయోగిస్తారు.

1. చర్మం జీవం లేకుండా వాడిపోయినట్లుగా కనిపిస్తే, స్నానం చేసే ముందు, కాస్త బరకగా వుండే చందనం పొడిని ముఖం, మెడ, చేతులూ, కాళ్లకు రాసుకోవాలి. దాంతో చర్మం మీదుండే మృతకణాల పొర తొలగిపోతుంది.
2. క్రీమ్ రూపంలో, ఫేస్ ప్యాక్‌ లా చందనాన్ని వాడుకుంటే సరిపోతుంది. సహజమైన నిగారింపు వస్తుంది.
3. గంధం వాడకంతో చర్మం మచ్చలు లేనిదిగా, సుందరంగా తయారవుతుంది.
4. ఫేస్ క్లెన్జర్గానూ, ఎండకు కమిలిన చర్మం మీదా చందనం తన చల్లని ప్రభావాన్ని చూపుతుంది.
5. చందనం గల సబ్బులూ, చందనం పేస్ట్తో రోజూ చర్మాన్ని శుభ్రపరచుకుంటే, కొద్ది రోజుల్లోనే చర్మం వికసించి, సహజకాంతితో మెరుస్తుంటుంది.
6. రోజూ చందనతైలాన్ని కొన్ని చుక్కలు వాడుకోవటం వల్ల, చెమట వల్ల ఏర్పడే దుర్గంధం పోతుంది. చందనంతో రోజూ బొట్టు పెట్టుకుంటే, మనస్సు, మస్తిష్కమూ ప్రశాంతంగా వుంటాయి.

Also Read: షర్మిల.. బ్యాక్ టూ ఆంధ్రా?

- Advertisement -