నాని ద‌ర్శ‌కుడితో వ‌రుణ్ తేజ్‌..?

234
siva-nirvana-varun

‘నిన్నుకోరి’తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న శివ నిర్వాణ రెండో సినిమాకు సిద్ధమయ్యాడు. మెగా హీరో వరుణ్‌ తేజ్‌ కోసం ఇప్పటికే కథను సిద్ధం చేసుకున్న శివ నిర్వాణకు అతడి వద్ద నుండి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసింది. దీంతో త్వరలోనే వరుణ్‌తో ఈ దర్శకుడు సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడనుందట. నిన్ను కోరిలో ఈ దర్శకుడు నాని ని చాలా బాగా చూపించాడు. ఇప్పుడు అదే తరహాలో వరుణ్ ని కూడా చూపించి ప్రేక్షకులను ఫిదా చేయాలనీ అనుకుంటున్నాడు.

Varun-Tej-next-film
ఇక ‘నిన్నుకోరి’ని నిర్మించిన డీవీవీ దానయ్యనే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మరోవైపు వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తుండగా, ఈ చిత్ర షూటింగ్‌ క్లైమాక్స్‌కు వచ్చేసింది. వచ్చేయేడాది ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.