గెలాక్సీ నోట్ 7 ఫోనా..? బాంబా..?

467
samsung galaxy note 7
- Advertisement -

స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో రారాజులా వెలిగిన శాంసంగ్ కు ఊహించని దెబ్బ తగిలింది. శాంసంగ్ కంపెనీ మార్కెట్లోకి ‘గెలాక్సీ నోట్ 7’ రూపంలో స్మార్ట్ ఫోన్‌ విడుదల చేసింది. గెలాక్సీ నోట్ 7 పై పేలుడు వార్తలు రావడంతో ఆస్ట్రేలియా క్వాంటాస్‌, వర్జిన్‌ ఆస్ట్రేలియా, అబుదాబీ సంస్థ ఎతిహాద్‌లు కూడా తమ విమానాల్లో ఈ ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించాయి.భారత్‌, అమెరికా, జపాన్‌కు చెందిన విమానయాన సంస్థలు కూడా పెద్ద తెరలతో ఉండే ఫోన్ల వాడకాన్ని విమానాల్లో నిషేధిస్తూ హెచ్చరికలు జారీ చేశాయి.

ap-sunny

ఈ జాబితాలోకి ఇప్పుడు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా చేరింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీలు పేలి ప్రమాదాలకు దారి తీస్తున్నందున ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు శనివారం సంస్థ ప్రకటించింది. తమ విమానాల్లో ఈ ఫోన్లను ఆన్‌ చేయడం, బ్యాటరీ చార్జింగ్‌ పెట్టడం వంటి వాటిని నిషేధిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.

అయితే బ్యాటరీ పేలుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో గతవారమే గెలాక్సీ నోట్‌ 7 ఫోన్లను వెనక్కి తీసుకోవాలని సామ్‌సంగ్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఆగస్లు 19న మొదటిసారి ఫోన్ ప్రారంభించిన అనంతరం ఇప్పటివరకూ 35 పేలిన కేసులు నమోదవ్వగా.. కంపెనీ ఇప్పటికే గెలాక్సీ నోట్-7 కొనుగోలు చేసిన వారందరికీ ముందు జాగ్రత్తలు చెప్పింది. ఫోన్ ఎట్టిపరిస్థితిలో ఆన్ చేయవద్దని, కంపెనీ వెనక్కు తీసుకునే వరకూ మొబైల్ ను స్విచ్ ఆఫ్ చేసి ఉంచాలని సూచించింది.

- Advertisement -