కేరళ నుండి రాహుల్‌ పోటీ..

813
rahul kerala
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీచేసే రెండో స్ధానంపై క్లారిటీ వచ్చేసింది. యూపీలోని అమేథీతో పాటు కేరళలోని వాయినాడ్‌ నుంచి రాహుల్ పోటీచేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాహుల్ రెండు ఎంపీ స్ధానాల నుండి పోటీచేస్తుండటం ఇదే తొలిసారి.

రాహుల్‌ను పోటీ చేయాల్సిందిగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు కోరారని ఆ పార్టీ నేత సూర్జేవాలా చెప్పారు. కార్యకర్తల విజ్ఞప్తి మేరకు వాయినాడ్‌ నుండి రాహుల్ పోటీచేస్తారని తెలిపారు. రాహుల్ నిర్ణయంపై కేరళ కాంగ్రెస్ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. రాహుల్ రెండు స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ నేత ఏకే ఆంటోని చెప్పారు.

అమేథి నుండి 2014 ఎన్నికల్లో బీజేపీ నేత,ప్రస్తుత కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందారు రాహుల్. అమేథి,రాయ్‌బరేలి రెండు నియోజకవర్గాలు కాంగ్రెస్‌కు కంచుకోట. రాయ్‌బరేలి నుండి సోనియా బరిలోకి దిగుతున్నారు.

అయితే 2014 తర్వాత అమేథిలో సీన్ రివర్సైంది. అమేథి పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ఓడిపోయింది. మరోవైపు స్మృతి ఇరానీ నుండి గట్టిపోటీ ఎదురవుతుండటంతో రెండోస్ధానంపై పోటీచేసేందుకు రాహుల్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

రాహుల్‌ కేరళ నుండి పోటీచేస్తుండటంపై స్మృతి ఇరానీ సెటైర్లు విసిరారు. పారిపో…రాహుల్…పారిపో అంటూ ట్వీట్ చేసిన స్మృతి అమేథీ నుంచి ఓడిపోతానని తెలిసే మరోస్ధానాన్ని రాహుల్ ఎంచుకున్నారని ఎద్దేవా చేశారు.

- Advertisement -