కేబుల్ బ్రిడ్జ్ ప్రమాదం.. రూ.4లక్షలు ఎక్స్ గ్రేషియా

180
- Advertisement -

గుజరాత్ లో కుప్పకూలిన బ్రిడ్జి ప్రమాదంలో 35 మంది మృత్యువాత పడ్డారు. మచ్చూ నదిపై నిర్మించిన ఈ కేబుల్‌ బ్రిడ్జిపై నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు. వంతెన తెగిన సమయంలో దానిపై 500 మంది ఉండగా.. 100 మందివరకు నీటిలో గల్లంతైనట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగి అవకాశముందని భావిస్తున్నారు.

కాగా మూడు రోజుల క్రితమే అధికారులు బ్రిడ్జికి మరమత్తులు చేసి మళ్లీ ప్రారంభించారు. దాదాపు వందేళ్ల క్రితం నాటి ఈ వంతెనకు ఇటీవలే మరమ్మతు పనులు పూర్తి చేసి తిరిగి ప్రజల సందర్శన కోసం తెరిచారు. పెద్ద సంఖ్యలో జనం ఈ వంతెనపై నిలబడటంతో సామర్థ్యానికి మించి బరువు కావడం వల్ల కూలినట్టుగా సమాచారం. ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతులకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటిస్తూ పీఎంవో ట్వీట్‌ చేసింది. మరోవైపు మృతులకు ఒక్కొక్కరికి రూ.4లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు సీఎం భూపేంద్ర పటేల్‌.

ఈ వంతెన 1879 ఫిబ్రవరి 20న బాంబే గవర్నర్‌ రిచర్డ్‌ టెంపుల్‌ ప్రారంభించారు. అప్పట్లో రూ.3.5లక్షల వ్యయంతో దీని నిర్మాణం పూర్తి చేశారు. ఈ వంతెన నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ ఇంగ్లాండ్‌ నుంచి తెప్పించారు. దర్బార్‌గఢ్‌ -నాజర్‌బాగ్‌ను కలుపుతూ నిర్మించిన ఈ వంతెనకు దాదాపు 140 ఏళ్ల చరిత్ర ఉంది. దీని పొడవు 765 అడుగులు.

ఇవి కూడా చదవండి

మునుగోడులో భారీ మెజారిటితో గెలుస్తాం

విశ్వగురువా? విషగురువా..?

సునామీ భయంతో 80 మంది సజీవ సమాధి

- Advertisement -