కస్టమర్లకు జియో షాక్‌..

551
Jio
Jio
- Advertisement -

ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు డేటాను అందిస్తున్నట్లు ప్రకటించి, ఇతర టెలికాం కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసిన రిలయన్స్ జియో.. తాజాగా మరో షాకిచ్చింది. రిలయన్స్ జియో సిమ్ నూ యాక్టివేట్ చేయవద్దని జియో ఆదేశాలిచ్చింది. కంపెనీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు ఏ సిమ్‌ కూడా యాక్లివేట్ చేయొద్దని ఆదేశాల్లో పేర్కోన్నట్లు సమాచారం. రిలయన్స్ జియో సిమ్ కార్డుల కొరత దేశవ్యాప్తంగా ఉండగా, సిమ్ లను పొందిన వారు యాక్టివేషన్ జరగక వేచి చూస్తున్న పరిస్థితుల్లో ఈ ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది.

“రిలయన్స్ జియో నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఏ సిమ్ నూ యాక్టివేట్ చేయవద్దు. రిలయన్స్ జియో ప్రెసిడెంట్ సునీల్ దత్ చెప్పేవరకూ కస్టమర్లు ఎవరికీ సిమ్ కార్డులు ఇవ్వద్దు. మీరు సిమ్ కార్డులు ఇస్తే కంపెనీకి తలనొప్పి వచ్చి ఇప్పుడున్న మంచి పేరు పోతుంది. మహారాష్ట్రలో 50 వేల సిమ్ కార్డులను యాక్టివేట్ చేయాల్సి వుంది. వాటన్నింటి యాక్టివేషన్ పూర్తయిన తరువాతే కొత్త సిమ్ లను ఇవ్వండి” అని రిలయన్స్ జియో నుంచి డిస్ట్రిబ్యూటర్లకు, కంపెనీ ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందింది.

డిసెంబర్‌ 31 వరకే మాత్రమే ఉచితం సేవలు అనడంలో కస్టమర్లు జియో సిమ్‌ కోసం రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ డిజిటల్ ఎక్స్ ప్రెస్ మినీ, థర్డ్ పార్టీ స్టోర్లకు వెళుతున్న కస్టమర్లు ఉత్త చేతులతో వెనుదిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. లక్షలాదిగా వస్తున్న కస్టమర్లకు సిమ్ కార్డులను అందించడంలో విఫలమవుతున్నామని, ఇచ్చిన కార్డుల యాక్టివేషన్ తరువాత, కొత్తవి ఇస్తామని సంస్థ వర్గాలు వెల్లడించాయి.

jio effect

ఇక జియో సిమ్ కొనుగోలు చేసిన వారు.. వెల్ కమ్ ఆఫర్‌లో భాగంగానే డిసెంబర్ 31 వరకూ అపరిమిత డేటా, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చని ముఖేష్ అంబానీ ప్రకటించారు. కానీ ఈ మాటలో ఏ మాత్రం నిజం లేదని తాజా ప్రకటన ద్వారా తేలింది. రోజంతా అపరిమిత డేటా ఇవ్వట్లేదని అంబానీ చేసిన ప్రకటన జియో జియో అంటూ ఎగబడిన వారికి షాకిచ్చిందనే చెప్పాలి.
ఇంకా 4జీబీ మాత్రమే అందుబాటులో ఉంటుందని.. రోజంతా అపరిమిత డేటా ఎలా ఇస్తామనే విషయాన్ని అంబానీ చెప్పకనే చెప్పారు. ఇక 4జీబీ కంటే ఎక్కువగా నెట్‌ను వినియోగిస్తే కనీసం బ్రౌజింగ్ కూడా కష్టమేనని జియో సిమ్ వినియోగదారులు అంటున్నారు. 128 కేబీపీఎస్ స్పీడ్‌తో నెట్ అందుబాటులో ఉంటుందని తాజాగా కంపెనీ వెల్లడించింది. ఈ సిమ్‌ను ఉపయోగించి సినిమాలు, వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారికి ఇది నిజంగా చేదువార్తనే చెప్పాలి.
- Advertisement -