కరోనా కట్టడికి పరిశుభ్రతే పరిష్కారం..

305
Osmania Hospital Doctors Awareness On Coronavirus
- Advertisement -

హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ సమాచార భవన్‌లో కొవిడ్ – 19పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉస్మానియా ఆస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డా. కొండల్ రెడ్డి, అపోలో హాస్పిటల్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డా. దివ్యాన్ష్ వాగ్రే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు కొండల్ రెడ్డి, దివ్యాన్ష్ వాగ్రే మాట్లాడుతూ.. కరోనా విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి నేరుగా కాంటాక్ట్‌లో ఉండడం గాని లేదా ఆ వైరస్ ఉన్న ఉపరితలాన్ని తాకడం వల్ల సోకుతుందన్నారు.

ఆయా ఉపరితలాలను బట్టి ఈ వైరస్ 4 నుంచి 72 గంటల వరకు ఉంటుంది. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, పరిశుభ్రంగా ఉండడమే దీనికి పరిష్కారం. ఏవైనా లక్షణాలపై అనుమానాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలి. లాక్ డౌన్ కరోనా కట్టడికి ఎంతగానో ఉపయోగపడింది. వ్యాక్సిన్ రావడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున ఇప్పుడు పాటిస్తున్న జాగ్రత్తలే పాటించాల్సి ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ పెంచే ఆహారం తీసుకోవాలి.ఉదయం పూట కాసేపు ఎండలో నిలబడడం మంచిదని డాక్టర్లు సూచించారు.

- Advertisement -