కబడ్డీ కూతకు రెడీ…

678
- Advertisement -

క్రికెట్‌ మాదిరిగా ఆటగాళ్ల చేతుల్లో బ్యాటూ బంతీ ఉండవు. హాకీలో ఉన్నట్టు అందరి దగ్గరా స్టిక్స్‌ కనిపించవు. ఫుట్‌బాల్‌లో లాగా ఎగిరి తన్నడానికి ఎదురుగా గుమ్మడికాయంత బంతీ లేదు. కాళ్లూచేతుల్నే ఆయుధాలుగా చేసుకుని కండ బలంతో, గుండె ధైర్యంతో ప్రత్యర్థిపై చేసే పోరాటం… వ్యూహప్రతివ్యూహాల మధ్య కేవలం నలభై నిమిషాల్లో ముగిసే కురుక్షేత్రం… కబడ్డీ! ‘ప్రొ కబడ్డీ లీగ్‌’తో మరింత ఆదరణ పెరిగి భారత క్రీడాభిమానులకు బాగా దగ్గరైంది.

kabaddi

అహ్మదాబాద్‌లో ఈ నెల 7న ప్రారంభం కానుంది. భారత్‌ సహా 12 జట్లు బరిలో ఉన్నాయి. భారత్‌, అమెరికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, ఇరాన్‌, పోలెండ్‌, థాయిలాండ్‌, బంగ్లాదేశ్‌, దక్షిణ కొరియా, జపాన్‌, అర్జెంటీనా, కెన్యా జట్టులు రెండు గ్రూపులుగా తలపడనున్నాయి. ఇప్పటిదాకా జరిగింది రెండే ప్రపంచకప్‌లు. తొమ్మిదేళ్ల విరామం తర్వాత జరగబోయే మళ్లీ ఈ ప్రపంచ టోర్నీ జరగబోతుండటం విశేషం. తొలి కప్పు 2004లో జరిగితే.. రెండో టోర్నీ 2007లో నిర్వహించారు. ఈ రెండు టోర్నీలకూ భారతే ఆతిథ్యమిచ్చింది. ఛాంపియన్‌ కూడా మన జట్టే.

kabaddi-world-cup

ఈ టోర్నీలో భారతే హాట్‌ ఫేవరెట్‌ అనడంలో ఎవరికీ సందేహాల్లేవు. మామూలుగానే కబడ్డీలో భారత్‌కు తిరుగులేదు. జట్టు నిండా స్టార్లే కావడంతో టోర్నీలో భారత్‌కు కప్ దక్కడం నల్లేరుపై నడకే కానుంది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బ తిన్న నేపథ్యంలో.. బలమైన పాకిస్థాన్‌ జట్టు ఈ టోర్నీలో పోటీ పడట్లేదు.

mens-kabaddi-team

భారత జట్టు

రైడర్లు: అనూప్‌ కుమార్‌ (కెప్టెన్‌), అజయ్‌ ఠాకూర్‌, దీపక్‌ హుడా, జస్వీర్‌ సింగ్‌, ప్రదీప్‌ నర్వాల్‌, రాహుల్‌ చౌదరి
డిఫెండర్లు: ధర్మరాజ్‌ చేరలతాన్‌, మోహిత్‌ చిల్లర్‌, సురేంద్ర నాడా, సుర్జీత్‌
ఆల్‌రౌండర్లు: కిరణ్‌ పర్మార్‌, మన్‌జీత్‌ చిల్లర్‌, నితిన్‌ తోమర్‌, సందీప్‌ నర్వాల్‌

- Advertisement -