ఒలింపిక్స్‌లో వైరల్‌గా మాధురి సాంగ్!

113
madhuri
- Advertisement -

టోక్యో ఒలింపిక్స్‌లో బాలీవుడ్ బ్యూటీ మాధురి దీక్షిత్ సాంగ్ వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ జట్టు స్విమ్మర్స్ ఈడెన్ బ్లెచర్, షెల్లీ బోబ్రిట్స్కీ అనే ఇద్దరూ జోడిగా ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ డ్యూయెట్ ఫ్రీ రొటీన్ ప్రిలిమినరీలో పోటీ పడ్డారు. ఈ సమయంలో ఇద్దరూ మాధురి దీక్షిత్ పాట ‘ఆజా నాచ్లే’ పాటకు డ్యాన్స్ చేస్తూ ఈత కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మాధురి దీక్షిత్, కొంకణ సేన్, కునాల్ కపూర్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆజా నాచ్లే . 2007లో విడుదలైన ఈ చిత్రానికి అనిల్ మెహతా దర్శకత్వం వహించారు.

- Advertisement -