దళిత బంధు నేటి నుండే..

79
kcr cm
- Advertisement -

ద‌ళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువ‌చ్చిన ద‌ళిత బంధు ప‌థ‌కం నేటి నుండి అమల్లోకి రానుంది. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమ‌ర్రి వేదిక‌గా ఇవాళ ప్రారంభంకానుంది.

గ్రామంలోని 76 ఎస్సీ కుటుంబాల‌కు ఇవాళ్టి నుంచే ద‌ళిత‌బంధు నిధులు అందజేయనున్నారు. ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు చొప్పున నిధులు అకౌంట్‌లో జమకానున్నాయి. ఈ మేర‌కు వాసాల‌మ‌ర్రి గ్రామానికి రూ.7.60 కోట్ల నిధుల‌ను మంజూరు చేశారు.

తర్వాత హుజురాబాద్‌ దశల వారిగా రూ. లక్ష కోట్లు ఈ పథకం కోసం ఖర్చు చేయనున్నారు. ఇక వాసాలమర్రిలో పర్యటించిన సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. దళితులు వెనకబడి ఉన్నారు కాబట్టి ఈ పథకం అమలు చేస్తున్నామన్నారు. దళిత బంధు ద్వారా దేశంలో తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెడతామన్నారు. ప్రపంచ దేశాలు రాష్ట్రం వైపు చూసేలా చేయాలన్నారు. అతి త్వరలో తాను చెప్పిన విధంగా బంగారు వాసాల‌మ‌ర్రి అవుతుందని సీఎం పేర్కొన్నారు.

- Advertisement -