ఎడ‌తెర‌పిలేని వ‌ర్షాలు..నిండుకున్న జ‌లాశ‌యాలు

93
- Advertisement -

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మబ్బులకు చిల్లుపడినట్లుగా వర్షాలు కురుస్తుండ‌టంతో భారీ వర్షాలకు జిల్లాల్లో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగవనుంచి వరద ఉగ్రరూపంలో తరలివస్తుంది. శనివారం ఉదయం 25 వేల క్యూసెక్కుల్లో ప్రవహించిన వరద ఇప్పుడు 3,20,000 క్యూసెక్కులకు చేరింది. ఎడతెరిపిలేని వర్షాలకు తోడుగా మహారాష్ట్రలో కురుస్తున్న అతిభారీ వర్షాల మూలంగా గోదావరిలో గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతున్నది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఏకధాటిగా వానలు కురుస్తూనే ఉన్నాయి.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులుకాగా, ప్రస్తుతం 1078 అడుగుల వద్ద ఉన్నది. జలాశయం నీటి సామర్థ్యం 90 టీఎంసీలు. ఇప్పుడు 49 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

- Advertisement -