ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌పై బీజేపీ తీరును తప్పుబట్టారు ఆప్ నేతలు. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇక ఎన్నికలంటేనే బీజేపీ భయపడుతోందని..కేజ్రీవాల్‌ని ఎదుర్కొనే దమ్ములేక ఈడీతో అరెస్ట్ చేయించిందని ఆరోపించారు ఆపన్ నేత, ఢిల్లీ మంత్రి అతిశీ.
లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత ఒక పార్టీ జాతీయ కన్వీనర్‌ను అరెస్టు చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌కు కూటమి నాయకులు సంఘీభావం తెలిపార… ఈడీని ఆయుధంగా చేసుకుని రాజకీయాలు చేయడం మానేయాలని బీజేపీకి సూచించారు.
ఇక కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనల్లో మంత్రులు పాల్గొన్నారు. రోడ్డుపై బైఠాయించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.మంత్రులు అతిషీ , సౌరభ్‌తో సహా పలువురు కార్యకర్తలు, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read:Ragi Ambali:అంబలితో ఆరోగ్యం