కెరియర్‌లో బిజీగా ఉన్న సమయంలోనే తండ్రి మరణం జూనియర్ ఎన్టీఆర్ ను కుంగదీసింది. ఓవైపు తండ్రి మరణించిన బాధను గుండెల్లోనే దాచుకుని మరోవైపు తాను తాజాగా నటించిన అరవింద సమేత షూటింగ్‌కు ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశ్యంతోనే ఎన్టీఆర్ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. మనసు భారంగా ఉన్నప్పటికి షెడ్యూల్ టైంకి సినిమాను పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతోనే అనుకున్న సమయానికే మూవీని కంప్లీట్ చేసుకున్నారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ బాటలోనే జూ.ఎన్టీఆర్ పయనిస్తున్నాడు. తన కుమారుడికి రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిసినా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్నాడు సీనియర్ ఎన్టీఆర్. తాత చూపిన మార్గంలో ఎన్టీఆర్ నడుస్తూ.. ముందు తరం వారికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకు మందు తీసిన సినిమా అజ్ఞాతవాసి ఫెయిల్ కావడంతో ఆ లోటును పూర్తి చేసుకునేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే నిర్మాత కష్టాల్లో ఉండడంతో తీసుకున్న రెమ్యునరేషన్ కూడా త్రివిక్రమ్ తిరిగి ఇచ్చేశాడు. ఇక ఈ మూవీ హిట్ కావడం ఎన్టీఆర్ తో పాటు త్రివిక్రమ్ కు కూడా చాలా ముఖ్యమైనదనే చెప్పాలి. ఈ చిత్రంలో తనదైనా నటనా శైలీతో నటించి.. రేపు అరవింద సమేతంగా ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తొలిసారిగా చేస్తున్న సినిమా కావడంతో అటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఇక ఇప్పటికే మూవీ చూసిన సెన్సార్ బోర్డు వాళ్లు, దుబాయ్ లో రివ్యూ చూసిన ప్రేక్షకులు చిత్ర సక్సెస్ అని చెప్తున్నారు. చిత్రం హిట్ టాక్ రావడంతో సినిమాలో యూనిట్ లో జోష్ నెలకొంది.