అమ్మకానికి అందమైన భార్య..

260
- Advertisement -

డిజిటల్ విప్లవం విజృంభిస్తున్న ఈ తరుణంలో వ్యాపారం అంతా ఆన్ లైనే. అయితే వెబ్ సైట్.. లేకపోతే యాప్. మార్కెటింగ్ వ్యూహాలు మారిపోయాయి. నీట్ గా టక్ చేసి టై కట్టుకుని స్టిఫ్ గా సెల్యూట్ చేసి ప్రొడక్ట్ గురించి చెప్పే ఎగ్జిక్యూటివ్ లకు వేగంగా కాలం చెల్లిపోతోంది. కేవలం ఒక చిన్న క్లిక్ తో అన్ని మీ ఇంటికే వస్తాయి. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక.. ఆన్ లైన్ వ్యాపారం ఊపందుకున్నది. రూపాయి ఖరీదు చేసే వస్తువుల దగ్గరి నుంచి లక్షల విలువ చేసే వస్తువల వరకు అన్ని ఆన్‌ లైన్‌లో దొరుకుతున్నాయి.

ఆన్ లైన్ వ్యాపారంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న తరుణంలో మనకు నచ్చిన వస్తువును కొనుక్కోవడం లేదా అమ్మడం చిటికెలో జరిగిపోతోంది. ఇప్పటివరకు ఆన్ లైన్‌లో మనం సెల్ ఫోన్‌లు లేదా వస్తువులు అమ్మడం అని చూసుంటాం. కానీ ఓ ప్రబుద్దుడు ఏకంగా భార్యను అమ్మకానికి పెట్టి షాక్‌కు గురిచేశాడు.నాడు హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి అప్పు తీర్చడానికి, ఇచ్చిన మాట కోసం తన భార్యను అమ్మకానికి పెడితే.. మనోడు మాత్రం తన భార్య ఇల్లాలి పాత్రను సమర్థవంతంగా నిర్వహించలేకపోతుండటంతో వేలానికి ఉంచుతున్నట్లు ప్రకటించాడు.

JOKER LISTS UNSYMPATHETIC WIFE WITH DECENT BODYWORK AND SKILLS IN THE KITCHEN ON EBAY

ఇంగ్లాండ్‌కు చెందిన జోకెర్ సిమన్ ఓకనె అనే వ్యక్తి తన భార్య లీండ్రా(27)ను ఈబేలో అమ్మకానికి పెడుతూ.. తాను ఎందుకు విక్రయించాలనుకుంటున్నది కూడా వివరాలతో సహా పేర్కోన్నాడు. అంతేగాక, ఆమె సుగుణాల గురించి కూడా పూర్తిగా వివరించాడు. ‘ఫర్ సేల్ వన్ వైఫ్’ ని అని మొదలు పెట్టిన సిమన్.. లీండ్రా బాగా నవ్వుతుందని, మంచి బాడీ వర్క్, చక్కని బాడీ షేప్ ఆమె సొంతమని పేర్కొన్నాడు. ఇక వంటపనిలో ఆమెకు తిరుగులేదని చెప్పుకొచ్చాడు. అయితే ఎప్పుడూ లొడలొడ వాగుతుండడం ఆమెలోని మైనస్ పాయింటని తెలిపాడు. ఆమె చాలామంచిదని పేర్కొన్న సిమన్.. ఆమెను దక్కించుకున్నవాడు అదృష్టవంతుడని పేర్కొన్నాడు.

JOKER LISTS UNSYMPATHETIC WIFE WITH DECENT BODYWORK AND SKILLS IN THE KITCHEN ON EBAY   JOKER LISTS UNSYMPATHETIC WIFE WITH DECENT BODYWORK AND SKILLS IN THE KITCHEN ON EBAY

ఆమె గుణగణాల గురించి చెబుతూ, లియాండ్రా చక్కగా నవ్వుతుందని, జిమ్ వర్క్ చేయడంతో మరింత చక్కని బాడీ షేప్ ఆమె సొంతమని తెలిపాడు. వంటపనిలో ఆమెకు తిరుగులేదన్నాడు. ఎప్పుడూ లొడలొడ వాగుతుండడం ఆమెకున్న లోపమని చెప్పాడు. ఆమెను దక్కించుకున్నవాడు అదృష్టవంతుడని పేర్కొన్న సిమన్, ఆమె చాలా మంచిదని తెలిపాడు. ఇదే సమయంలో ఒకసారి అమ్మిన వస్తువు తిరిగి తీసుకోబడదని షరతు విధించాడు.

ఓకనె సేల్‌కు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. కేవలం రెండు రోజుల్లోనే 65,880 పౌండ్ల బిడ్లు వచ్చాయి. అయితే, తనను అమ్మకానికి పెట్టాడని తెలుసుకున్న లియాండ్రా అతనిని చంపేస్తానని పేర్కొంది. ఇంతకీ ఈ వేలాన్ని సరదా కోసం పెట్టాడా? లేక సీరియస్సా? అనేది తెలియాల్సివుంది.

గతంలో మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ రైతు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి కట్టుకొన్న భార్యనే ఫేస్‌బుక్‌లో లక్ష రూపాయలకు అమ్మకానికి పెట్టాడు. అప్పు తీర్చాలని రుణదాతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో గత్యంతరం లేక ఈ చర్యకు పాల్పడ్డానని ఇండోర్‌కు చెందిన రైతు దిలీప్ మాలీ పేర్కొన్న సంగతి తెలిసిందే. భర్త చేసిన నిర్వాకంపై భార్య స్థానిక ఎయిరోడ్రోమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రైతుపై ఐపీసీ సెక్షన్ 509 కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -