సోనూసూద్ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది బలమైన విలన్. సినిమాలలో ఎక్కువగా ప్రతినాయకుడి పాత్రలు పోషించి తనకంటూ ఓ గొప్ప పేరును సంపాందించుకున్నారు. ‘అరుంధతి’ చిత్రంలో భయంకరమైన విలన్ ‘పశుపతి’గా నటించి ప్రశంసలందుకున్నారు.
తాజాగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ‘మణికర్ణిక’ చిత్రంలో సూనూ సూద్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సదాశివ్ అనే మరాఠీ రాజు పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సోనూ రాజు గెటప్ లొ అదుర్స్ అనిపించాడు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యాయి. వీరనారి ఘాన్సీ లక్ష్మీబాయి జీవిత కథాంశంతో జీ స్టూడియోస్, కమల్ జైన్, నిషాంత్ పిట్టి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కంగనా రనౌత్ నటిస్తున్నవిషయం తెలిసిందే. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో విడుదలకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.