పిల్లల విషయంలో క్లారిటీ ఇచ్చిన -సామ్‌

273
Samantha wants a baby

అక్కినేని వారింటి కోడ‌లైనా స‌మంత జోరు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. సాధ‌ర‌ణంగా పెళ్లైన వారిని క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో హీరోయిన్లుగా తీసుకోవ‌డానికి భ‌య‌ప‌డ‌తారు. కానీ, స‌మంత విష‌యంలో మాత్రం అలా జ‌ర‌గ‌డం లేదు. ఇటీవ‌ల స‌మంత హీరోయిన్‌గా న‌టించిన `రంగ‌స్థ‌లం` తెలుగులో `బాహుబ‌లి` త‌ర్వాత అతి పెద్ద విజ‌యం సాధించింది. ఈ సినిమాలో స‌మంత న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

Samantha wants a baby?

అయితే హీరోయిన్‌ సమంత తల్లి కాబోతోందంటూ ఇటీవల బాగా ప్రచారం జరిగింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై స్పందిస్తూ.. తాను, తన భర్త నాగ చైతన్య పిల్లల గురించి ఇప్పుడే ఆలోచించట్లేదని, పిల్లల్ని కనేందుకు ఓ టైమ్‌ అనుకున్నామని సామ్‌ తెలిపింది. ఆ టైమ్‌ వచ్చే వరకు తమ కెరీర్‌ గురించే తప్ప వేరే ఆలోచనలు చేయకూడదనుకున్నామని చెప్పింది. కాగా, ఒక్కసారి తాను తల్లిగా మారితే, ఇక తనకు పిల్లలే ప్రపంచమని తెలిపింది.

తను ఓ చిన్నారికి జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డకే అంకితం అయిపోవాలని ఫిక్స్ అయిందట సామ్. చిన్నతనంలో తానేమీ అంత గారాబంగా పెరగలేదని.. కానీ తన బిడ్డను మాత్రం అపురూపంగా చూసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పిన సమంత.. తాను అమ్మగా మారిన తర్వాత కొన్నేళ్ల పాటు ఆ బిడ్డను వదిలి ఎక్కడికీ వెళ్లే సమస్యే లేదని అంటోంది సామ్‌. ఇటీవలే ‘రంగస్థలం’ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న సమంత ప్రస్తుతం ‘మహానటి’లో నటిస్తోన్న విషయం తెలిసిందే.