ప్రస్తుతం మహేశ్‌బాబు.. మురుగదాస్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తమిళ వెర్షన్ విషయంలో ప్రిన్స్, మురుగదాస్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని టాలీవుడ్ గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళ్ వర్షన్ లో కొన్ని మార్పులు చేసి విడుదల చేద్దామని ప్రిన్స్ మహేశ్‌కు మురుగదాస్ చెప్పాడట. తమిళ నేటివిటీకి తగ్గట్టు అక్కడి లోకల్ స్లాంగ్‌ను వాడదామని మహేశ్‌తో అన్నాడట. అయితే..దాని వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉందని, ఆ ప్రయత్నం వద్దని మురుగదాస్‌కు చెప్పాడని టాక్.
అంతేకాదు.. తెలుగులో ఎలా తీస్తున్నారో తమిళంలోనూ ఎలాంటి మార్పుల్లేకుండా అలాగే ఉండాలని కరాఖండిగా మురుగదాస్‌కు తేల్చి చెప్పాడట మహేశ్.దీంతో మురుగదాస్ మహేష్ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. మురుగదాస్ తమిళ్ వాడు కావడంతో ఆయనకు అక్కడి ప్రేక్షకుల అభిరుచి తెలుసు.అయితే మహేష్ ఇవేవి పట్టించుకోకుండా మాట్లాడడం.. మరుగుదాస్ ను బాధించింట.చివరకి మహేశ్నూ ఏ మాత్రం ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని మురుగదాస్.. సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రంపై తమిళనాట కూడా క్రేజ్ పీక్ లేవల్లో ఉంది.
Courtesy – YOYO TV