- Advertisement -
గడిచిన 137 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన నెలగా జూలై రికార్డు సృష్టించింది. 20వ శతాబ్దం సగటు ఉష్ణోగ్రతల కన్నా ఈ జూలైలో 1.57 డిగ్రీ ఫారన్‌హీట్ అధికంగా నమోదయిందని అమెరికాలోని నేషనల్ ఓషనిక్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. 1880లో ఆధునిక ఉష్ణోగ్రతల నమోదు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి భూమిపై జులై 2016లో నమోదైన ఉష్ణోగ్రతనే అత్యధికం అని వెల్లడించింది.
అంతకు ముందు 2015, 2011, 2009 సంవత్సరాలలోని జులై నెలలతో పోల్చితే.. సరాసరిగా 0.1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఈ జులైలో అధికంగా నమోదైనట్లు నివేదిక తెలిపింది.
సాధారణంగా మిగిలిన నెలల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతలతో పోల్చితే జులై నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు పెరగటంతో పాటు.. ఇతర కారణాలతో ప్రతిఏటా క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కలవరపెడుతున్నాయి.
- Advertisement -