ఎకో ఫ్రెండ్లీ ..మట్టి గణపతి

241
- Advertisement -

దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా వినాయక సందడే కనిపిస్తోంది.ప్రజలు అత్యంతభక్తిశ్రద్ధలతో లంబోదరుడ్ని ఆరాదీస్తారు.చవితి పురస్కరించుకుని ఎక్కడ చూసినా వినాయకుడి మండపాలే కనిపిస్తున్నాయి.ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలు,వాటికి పూసే రసాయనాలు కాలుష్యంపై తీవ్రప్రభావం చూపుతాయి.భారీ విగ్రహాల్లో వాడే కెమికల్స్ వల్ల ఎన్నో అనర్థాలున్నాయి.అదే ఎకో ఫ్రెండ్లీ గణేశుని విగ్రహాల వల్ల ఎలాంటి హాని ఉండదు. పండుగలనేవి మత విశ్వాసాలను చాటుకుంటూనే..పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యలు కావాలి.

మట్టి, గడ్డి, జనప నార, వెదురు పుల్లల వంటి సహజంగా లభించే పదార్థాలను ఉపయోగించి విద్యార్థులు వినాయక విగ్రహాల వల్ల ఎలాంటి నష్టం ఉండదు.పర్యావరణానికి హాని కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలతో వినాయకచవితి చేసుకోవాలి. ఈ ఆలోచనను ప్రజల మనసుల్లో బలంగా నాటుతున్నాయి ప్రభుత్వాలు, మీడియా, స్వచ్ఛందసంస్థలు. గత కొన్నేళ్లుగా మట్టి విగ్రహాలను వాడే సంస్కృతి బాగానే పెరిగింది.

గణేశ్ చతుర్థి, దుర్గానవరాత్రులకు మట్టి విగ్రహాలనే ఉపయోగించాలని మన్ కీ బాత్ లో సూచించారు ప్రధాని మోడీ. మట్టి విగ్రహాలతో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని….మట్టివిగ్రహాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలన్నారు.రియో ఒలింపిక్స్ లో పతకాలను సాధించి అమ్మాయిలు దేశ కీర్తిని పెంపొందిచారన్నారు. పుల్లెల గోపిచంద్ తపస్సు గొప్పదని చెప్పారు. క్రీడల పట్ల ఆయన అంకితభావం అమోఘమని చెప్పారు మోడీ. మదర్ థెరీసా సేవలను గుర్తు చేసుకున్నారు.

అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే శివపార్వతిల పుత్రుడైన గణేశుడి విగ్రహాలను ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేస్తే..ఆ విగ్రహాల్లో వాడే రసాయనాలు ఇతర సామాగ్రి కాలుష్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.అంతేకాకుండా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది.ఇక మట్టి అనేది సమస్త జీవనానికి ఆధారం.మట్టిలో ఓవిత్తనం వేస్తే మొలకెత్తుతుంది.మట్టితో చేసిన విగ్రహాలు నీటిలో వేయగానే అమాంతంగా కరిగిపోతాయి.అందుకే మట్టి వినాయక విగ్రహాలవైపు భక్తులు మక్కువ చూపుతున్నారు.

పలు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు బాధ్యతగా మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటు గురించి ప్రచారం చేస్తుండటంతో..భక్తుల్లో అవగాహన పెరుగుతోంది.దీంతో ప్రతి ఏటా వినాయక చవితికి మట్టి విగ్రహాలకు ఆదరణ పెరుగుతోంది.ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను ప్రతిష్టించిన కాలుష్య నివారణలో మమేకం కావాలని కోరుకుందాం.

- Advertisement -