హైదరాబాద్‌లో టీఆర్ఎస్ భారీ బహిరంగసభ..!

778
kcr trs
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ బహిరంగసభను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది టీఆర్ఎస్. ఎల్బీస్టేడియంలో టీఆర్ఎస్ నిర్వహించిన సభ ఫెయిల్ అయిందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వార్తలకు పుల్ స్టాప్ పెడుతూ భారీ బహిరంగసభతో సత్తాచాటాలని భావిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.

హైదరాబాద్‌‌లో భారీ బహిరంగసభను నిర్వహించేందుకు రంగంలోకి దిగారు కేటీఆర్. ఇవాళ గ్రేటర్ కార్పొరేటర్లతో సమావేశం జరిపిన కేటీఆర్ మరోసారి గ్రేటర్ హైదరాబాద్‌లో బహిరంగసభ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చించారు. సభ సక్సెస్ అయ్యేందుకు కేటీఆర్ పలు సూచనలు చేశారు. ఏప్రిల్ 5వ తేదీ తర్వాత భారీ బహిరంగస నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

కారు – సారు – పదహారు-ఢిల్లీలో సర్కార్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారంలో దూసుకపోతోంది టీఆర్ఎస్. ఓ వైపు సీఎం కేసీఆర్ మరోవైపు కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 26న ఎల్బీ స్టేడియం లో టీఆర్ఎస్ సభ నిర్వహించింది. ఈ సభకు ప్రజలు భారీగా తరలి రాలేదనే కారణంతో సీఎం కేసీఆర్ గైర్హాజర్ అయ్యారని ప్రచారం జరిగింది. దీంతో ఈ వార్తలకు చెక్ పెట్టేందుకు భారీ బహిరంగసభతో ప్రజల ముందుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు గులాబీ నేతలు.

- Advertisement -