- Advertisement -
తెలంగాణ ప్రజానీకానికి అత్యంత కీలకం, శుభప్రదమైన దసరా పర్వదినం రోజున సిద్దిపేటను కొత్త జిల్లాగా సిఎం కేసీఆర్ ఆవిష్కరించారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం 11.12 గంటలకు శాస్త్రోక్తంగా సిద్ధిపేట జిల్లాను ప్రారంభించారు.
నిర్ణీత సమయానికి సిద్ధిపేట కలెక్టర్ భవనానికి చేరుకున్న కేసీఆర్ తొలుత పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం, కేసీఆర్, హరీష్ రావులు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత, కొత్త జిల్లా శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం, హారతి ఇచ్చి, బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి, దాన్ని పగలగొట్టి, రిబ్బన్ కట్ చేసి కలెక్టరేట్ భవంనంలోకి ప్రవేశించారు.
- Advertisement -