కొత్త జిల్లాల్లో కలెక్టర్లు వీరే..

507
- Advertisement -

తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 31 జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నియమించింది. కొత్త కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల జాబితాను సీఎం కేసీఆర్ పరిశీలించి.. ఆమోదం తెలిపిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జిల్లాలకు కొత్త కలెక్టర్లుగా వెళుతున్న 16మంది ఐఏఎస్ అధికారులతో సీఎస్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఉద్దేశం.. వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అన్నదానిపై అధికారులకు ఆయన వివరించారు.

 cs

కొత్తజిల్లాలకు రవాణాశాఖ అధికారుల నియామక ప్రక్రియను ప్రభుత్వం పూర్తిచేసింది. రోడ్డు రవాణాశాఖ అధికారి (ఆర్టీవో) కార్యాలయాల్లో ప్రస్తుతం సీనియర్లుగా ఉన్న తొమ్మిది మంది ఎంవీఐలకే ఆర్టీవోలుగా బాధ్యతలు అప్పగించింది. అదేవిధంగా కొత్తజిల్లాలకు కొత్త కోడ్లను కేటాయించింది. పలుచోట్ల జేటీసీలు, డీటీసీలకు కూడా బాధ్యతను భుజాలకెత్తింది. ప్రతిజిల్లాకు ఆర్టీవో కార్యాలయం ఏర్పాటు చేయడం, ప్రతిపాదిత కొత్తజిల్లాలో ఇప్పటికే పనిచేస్తున్న ఎంవీఐ యూనిట్ ఆఫీసులను అప్‌గ్రేడ్ చేస్తూ ఆర్టీవో కార్యాలయాలుగా మార్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది.

patika2

- Advertisement -